వ్యాక్సిన్‌కు రెండు సంవత్సరాలు, కానీ..
close
Published : 23/05/2020 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌కు రెండు సంవత్సరాలు, కానీ..

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ రావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అన్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో కూడా రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. పుణెకు చెందిన సీరమ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ప్రతి సంవత్సరం వివిధ రకాల 150 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తోంది.

‘వాస్తవంగా అయితే వ్యాక్సిన్ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో కూడా రావొచ్చు’ అని అదర్‌ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం సీరమ్ సంస్థ యూకేకి చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన కొడాజెనిక్స్‌, ఆస్ట్రియన్ బయోటెక్ సంస్థ థెమిస్ సంస్థలతో  కలిసి పనిచేస్తోంది. ‘చాలా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ, అమెరికాకు చెందిన మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఈ వరసలో ముందున్నాయి’ అని ఆయన వెల్లడించారు. 

‘కొవిడ్ 19 వ్యాక్సిన్‌ తయారీ కోసం అన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి. మేం దాన్నుంచి లాభం పొందుతామా లేక పెట్టుబడులను తిరిగి పొందుతామా అన్నది తెలియదు. కానీ అన్ని కంపెనీలు మాత్రం దాన్ని సరసమైన ధరలకే అందించాలని చూస్తాయి. తయారీదారుల నిర్ణయం మీదే ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రజలు వ్యాక్సిన్‌కు డబ్బులు చెల్లిస్తారని నేను అనుకోవడం లేదు. ప్రభుత్వాలు, బీమా కంపెనీలే ఆ బాధ్యత తీసుకుంటాయనుకుంటున్నాను ’అని వెల్లడించారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని