విమాన ప్రమాదంలో 97కి చేరిన మృతులు 
close
Published : 23/05/2020 08:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమాన ప్రమాదంలో 97కి చేరిన మృతులు 

కరాచీ: పాకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు చేరింది. విమానంలో సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుప్పకూలడానికి ముందు రెండు మూడు సార్లు సమీప ప్రాంతాల్లో విమానం చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ ల్యాండ్‌ చేయడానికి బదులు పైనే ఉండడం సురక్షితమని భావించినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. పైలట్‌ చివరి క్షణాల సంభాషణను విశ్లేషించిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చారు. రెండు రన్‌వేలు ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంచినప్పటికీ.. పైలట్‌ అందుకు సాహసించలేదని తెలిపారు.

ఇక నివాస సముదాయాల్లో విమానం కూలడంతో స్థానికులకు చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పురుషులు చాలా మంది మసీదులకు వెళ్లడంతో గాయపడిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. విమానం భారీ స్థాయిలో ఛిద్రమవడంతో మృతదేహాల్ని వెలికితీయడం కష్టంగా మారిందని సహాయక సిబ్బంది తెలిపారు. మృతుల్లో చాలా మంది సీటుబెల్టు పెట్టుకునే ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి..

విషాదయానం

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని