పాక్‌ విమానం కూలకముందు ఏం జరిగిందంటే..
close
Published : 25/05/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ విమానం కూలకముందు ఏం జరిగిందంటే..

కరాచి: పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఓ ప్రయాణికుడు ఘటనకు ముందు ఏం జరిగిందో వివరించాడు. లాహోర్‌లో బయలుదేరిన విమానం కరాచీ వరకు బాగానే వచ్చిందని, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని ముహమ్మద్‌ జుబేర్‌ అనే ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణించగా ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో జుబేర్‌ ఒకరు కాగా, మరో వ్యక్తి బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ సీఈవో జఫర్‌ మసుద్‌. కరాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జుబేర్‌ మీడియాతో మాట్లాడాడు. 

‘పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 8303 విమానం లాహోర్‌ నుంచి సాఫీగానే వచ్చింది. నా సీటు 8ఎఫ్‌. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే.. పైలట్‌ అందర్నీ సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. సరిగ్గా ల్యాండయ్యే సమయానికి విమానం మూడుసార్లు కుదుపులకు గురైంది. రన్‌వేను సమీపించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి పైలట్‌ విమానాన్ని అమాంతం గాల్లోకి పైకిలేపాడు. 10, 15 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాక.. మళ్లీ ల్యాండ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయన చెబుతుండగానే నేను కిందకి చూశాను. మాలిర్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో ఉన్నామని అర్థమైంది. అంతలోనే విమానం జనావాసాల మధ్య కుప్పకూలింది. నేను స్పృహ కోల్పోయి కళ్లు తెరిచి చూసేసరికి అక్కడంతా పొగ వ్యాపించింది’ అని జుబేర్‌ తన భయానక అనుభవాన్ని వివరించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని