భౌతిక దూరం పాటించడం ‘ఇంగిత జ్ఞానం’
close
Published : 25/05/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భౌతిక దూరం పాటించడం ‘ఇంగిత జ్ఞానం’

ఎయిరిండియాకు పది రోజుల పాటు వెసులుబాటు

 

 

దిల్లీ: విదేశాల నుంచి భారతీయులను రప్పించడానికి కేటాయించిన ప్రత్యేక విమానాల్లో మధ్య సీట్లను కచ్చితంగా ఖాళీగా ఉంచాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం భౌతిక దూరం పాటించడం ‘ఇంగిత జ్ఞానం’ అంటూ సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే రానున్న 10 రోజులు మాత్రం  మధ్య సీట్లను కూడా నింపి, కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చంటూ ఎయిరిండియాకు వెసులుబాటు కల్పించింది. అయితే, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఉద్దేశించి మాత్రమే సుప్రీం ఈ వాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా,  విమానంలోని అన్ని సీట్లను నింపుతూ, సోమవారం నుంచి దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

‘భౌతిక దూరాన్ని పాటించడం ఇంగిత జ్ఞానం. బయట సమారు ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి. విమానాల లోపల సంగతి ఏంటి?’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఎయిరిండియాను ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఈ ప్రభుత్వ రంగ సంస్థ ‘వందే భారత్‌’మిషన్‌ పేరిట స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. సీట్లను ఖాళీగా ఉంచడం కంటే, పరీక్షలు చేయడం, క్వారంటైన్‌లో ఉంచడమే మంచి విధానమని, జూన్ 16 వరకు బుకింగ్స్‌ పూర్తయ్యాయని ఎయిరిండియా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వెల్లడించారు. ‘వైరస్‌ ప్రయాణికుల మీద ప్రభావం చూపదని మీరు ఎలా చెప్పగలరు? విమానంలో ఉన్నానని, ఇతరులకు సోకకూడదని వైరస్‌కు తెలుస్తుందా? పక్కపక్కనే కూర్చుంటే వైరస్‌ ప్రభావం ఉంటుంది’ అని మెహతా అభ్యర్థనను తిరస్కరిస్తూ, కొన్ని రోజుల పాటు వెసులుబాటు మాత్రమే కల్పించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పుల గురించి ఆలోచించాలన్నారు. 

సోమవారం నుంచి దేశీయంగా విమాన ప్రయాణాలను ప్రారంభిస్తామని వారం క్రితం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటిస్తూ, మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలన్న నిబంధనను తోసిపుచ్చారు. దీంతో ధరలు పెరుగుతాయని తెలిపారు. కాగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్ మార్చి 23న జారీ చేసిన మార్గదర్శకాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలని సూచించినప్పటికీ, తన ప్రత్యేక విమానాల్లో ఎయిరిండియా ఆ సూచనను పాటించడం లేదని ఆ సంస్థకే చెందిన పైలట్ ఒకరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎయిరిండియా నిర్ణయాన్ని తప్పుపడుతూ  హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం, ఎయిరిండియా సుప్రీంను ఆశ్రయించాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని