చిన్నారులకు మాస్కులు ప్రమాదమా?
close
Updated : 26/05/2020 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారులకు మాస్కులు ప్రమాదమా?

దిల్లీ: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించడమే ఏకైక మార్గమని అంతర్జాతీయ నిపుణలు చెబుతున్న మాట. అయితే మరి చిన్నారులకు మాస్కులు ఎంతవరకు అవసరం అనే విషయంపై చర్చ కొనసాగుతోంది. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అత్యంత ప్రమాదకరమని జపాన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి ధరించడం వల్ల చిన్నారులకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని జపాన్‌ పిడియాట్రిక్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. సాధారణంగా చిన్నారుల్లో శ్వాసమార్గం ఇరుకుగా ఉంటుందని.. మాస్కు ధరించినప్పుడు గాలి పీల్చితే అది గుండెపై భారం పెంచుతుందని తెలిపింది. అంతేకాకుండా అది ఒక్కోసారి వడదెబ్బకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కారణంగా 2 సంవత్సరాలలోపు పిల్లలు మాస్కు వాడొద్దని సూచించింది. జపాన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా తల్లిదండ్రులకు ఈ విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటివరకూ చిన్నారులు కొవిడ్‌ బారినపడి ప్రమాదకరంగా మారిన ఘటనలు జపాన్‌లో తక్కువేనని..కేవలం వారి కుటుంబ సభ్యులనుంచే ఈ వైరస్‌ సంక్రమిస్తున్నట్లు తెలిపింది.

జపాన్‌లో వైరస్‌ తీవ్రత తగ్గడంతో అక్కడ విధించిన అత్యయికస్థితిని ఎత్తివేస్తున్నట్లు తాజాగా జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే ప్రకటించారు. అయితే, దేశంలో రెండో దఫా వైరస్‌ తీవ్రత పెరిగితే మాత్రం మరోసారి అత్యయికస్థితి కొనసాగిస్తామని ముందుగానే హెచ్చరించారు. ఇదిలా ఉంటే, అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ), అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ కూడా రెండు సంవత్సరాలలోపు చిన్నారులు మాస్కులు ధరించవద్దని ఇదివరకే స్పష్టంచేశాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని