చైనాపై తీవ్ర చర్యలు ఈ వారంలోనే..! ట్రంప్‌
close
Published : 28/05/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాపై తీవ్ర చర్యలు ఈ వారంలోనే..! ట్రంప్‌

స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. ఈ విషయంలో చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా హాంకాంగ్‌ విషయంలో మాత్రం చైనాపై చర్యలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అవి ఈ వారం చివర్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. వైట్‌హౌజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. ఈ వారం చివర్లో ప్రకటించే చర్యలు చాలా శక్తిమంతంగా, ఆసక్తికరంగానూ ఉంటాయని అన్నారు.

చైనా ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమల్లోకి తెస్తామని చైనా ప్రకటించడంతో హాంగ్‌కాంగ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులను అదుపుచేయడానికి అక్కడి పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఈ సందర్భంగా వందల మందిని అరెస్టు చేశారు. హాంకాంగ్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవీ చదవండి..
పుట్టి ముంచిన ‘వుహాన్‌ విందు’..!
టిక్‌టాక్‌పై దెబ్బ పడిందా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని