దిల్లీ ఎయిమ్స్‌లో 195మంది సిబ్బందికి కరోనా
close
Published : 29/05/2020 03:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ ఎయిమ్స్‌లో 195మంది సిబ్బందికి కరోనా

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో వైద్య సిబ్బందికి మహమ్మారి సోకడం కలకలం రేపుతోంది. దిల్లీ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు 195 సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. గత రెండు రోజుల వ్యవధిలోనే 50 మంది సిబ్బందికి ఈ మహమ్మారి సోకడం గమనార్హం. వీరిలో ఎంబీబీఎస్‌ విద్యార్థితో పాటు రెసిడెంట్‌ వైద్యులు, నర్సులు, మెస్‌ వర్కర్లు, లేబోరేటరీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, భద్రతా విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. 

ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా సోకిన 195మందిలో బోధనా సిబ్బంది, రెసిడెంట్‌ వైద్యులతో పాటు 21 నర్సింగ్‌ సిబ్బంది, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 32మంది శానిటేషన్‌ వర్కర్లు, 68మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఈ వైరస్‌ లక్షణాల నుంచి కోలుకొని మళ్లీ విధుల్లోకి హాజరు కాగా.. మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ ఆదివారం శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి మృతిచెందాడు. 

ఎన్‌డీఎంసీ ప్రధాన కార్యాలయం మూసివేత

న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ ఉద్యోగికి కరోనా సోకవడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజాగా నమోదైన కేసుతో ఎన్‌డీఎంసీలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య ఏడుకి చేరింది. జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి ఉద్యోగికి కరోనా సోకినట్టు ఓ సీనియర్‌ ఉద్యోగి తెలిపారు.  నిన్న కూడా ముగ్గురు ఈ మహమ్మారి బారిన పడ్డారని ఆయన వివరించారు. వారిని కలిసిన వ్యక్తుల్ని గుర్తించే ప్రక్రియ సాగుతోందన్నారు. ప్రస్తుతానికైతే కార్యాలయాన్ని సీజ్‌ చేశారనీ.. శానిటైజేషన్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పరిసరాల్లో శానిటైజ్‌ పనులు పూర్తయి కార్యాలయం పునఃప్రారంభమయ్యే వరకు ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రం హోమ్‌ ద్వారా పనిచేస్తారని అధికారులు తెలిపారు. 

దిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి.  నిన్న ఒక్క రోజే 792 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య  15257 చేరింది. ఇప్పటివరకు 303మంది ప్రాణాలు కోల్పోయారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని