ఉద్యోగుల బహిష్కరణపై భారత్‌కు పాక్‌ నిరసన
close
Published : 01/06/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగుల బహిష్కరణపై భారత్‌కు పాక్‌ నిరసన

 

ఇస్లామాబాద్‌: గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై దిల్లీలోని తమ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను భారత్‌ బహిష్కరించినందుకు పాకిస్థాన్‌ తీవ్ర నిరసన తెలిపింది. పాక్‌ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు...అబిద్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ తహీర్‌లు ఓ భారతీయునికి డబ్బులు ఇచ్చి సైనిక స్థావరాలకు చెందిన కీలక పత్రాలను తీసుకొంటుండగా దిల్లీ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. దాంతో 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని వారిని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు నిరసన తెలిపిన పాక్‌..సోమవారం ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన ఉన్నత దౌత్యాధికారి అయిన ఛార్జ్‌ డి అఫైర్స్‌ను పిలిపించి నిరసన పత్రాన్ని అందజేసింది. ఉద్యోగులను బహిష్కరించడం ద్వారా భారత్‌ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని విమర్శించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని