మాస్కు ధరించలేదని ఐజీ స్వీయ జరిమానా!
close
Published : 07/06/2020 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్కు ధరించలేదని ఐజీ స్వీయ జరిమానా!

కాన్పూర్: బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం మరచిపోయినందుకు తనకు తానుగా స్వీయ జరిమాన విధించుకున్నారు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌. బయటకు వచ్చిన సమయంలో మాస్క్‌ ధరించలేదని తనను తాను సరిచూసుకుని వెంటనే బర్రా పోలీస్‌ స్టేషన్‌ అధికారి రంజీత్ సింగ్‌ దగ్గరకు వెళ్లి జరిమానా రాయమని ఐజీ కోరారు. దీంతో స్టేషన్‌ అధికారి ఆయనకు రూ.100 జరిమానా విధించగా.. వెంటనే ఆ మొత్తాన్ని ఐజీ చెల్లించారు. 
ఈ సందర్భంగా అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘తనిఖీలో భాగంగా వాహనం దిగి బర్రా పోలీస్‌స్టేషన్‌లోనికి వెళ్లాను. సబార్డినేట్స్‌, సర్కిల్‌ అధికారులతో మాట్లాడాను. అప్పుడే నా ముఖానికి మాస్కు లేదనే విషయం జ్ఞప్తికి వచ్చింది. వెంటనే బయట ఉన్న నా అధికారిక వాహనం వద్దకు వెళ్లి అందులో నుంచి మాస్కు తీసి పెట్టుకున్నాను. అయితే నేను చేసిన తప్పునకు జరిమానా విధించుకోవడం నైతికత అవుతుంది. పోలీసులకు, ప్రజలకు ఈ సంఘటన ఒక ఉదాహరణగా కూడా ఉంటుందని భావించి చలానా విధించుకున్నట్లు’ ఐజీ వివరించారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 జరిమానా విధిస్తున్నట్లు ఐజీ తెలిపారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అధికారులంతా  కఠినంగా అమలు చేసేలా చూస్తామని ఆయన వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని