మహారాష్ట్ర పాలన సర్కస్‌ను తలపిస్తోంది 
close
Updated : 09/06/2020 23:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్ర పాలన సర్కస్‌ను తలపిస్తోంది 

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి  రాజ్‌నాథ్‌సింగ్‌ అసంతృప్తి

ముంబయి: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శివసేన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర భాజపా కార్యకర్తల వర్చువల్‌ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే శివసేన ప్రభుత్వం పరిపాలన చేస్తుందా.. లేదా సర్కస్‌ నడుపుతోందా అన్నట్లు ఉందన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌పై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతను చేస్తున్న పనికి ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. పేదలు, వలస కూలీలకు సోనూసూద్‌ చేస్తున్న సాయాన్ని భాజపా ఆడిస్తున్న డ్రామాగా శివసేన ప్రభుత్వం పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కరోనా బారిన పడ్డవారు ఆంబులెన్స్‌ కోసం 16గంటలు వేచిచూడాల్సి వస్తోందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఎన్సీపీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ లాంటి బలమైన నాయకుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర, చైనాను కూడా దాటిపోయిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను చూసి మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని