ఇమ్రాన్‌, వారిని మార్చు...
close
Published : 13/06/2020 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇమ్రాన్‌, వారిని మార్చు...

మా సహాయం మీ జీడీపీ కంటే అధికం!
పాక్‌ ప్రధానికి భారత్‌ హితవు...

దిల్లీ: భారత్‌ తమను చూసి నేర్చుకోవాలన్న పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా జవాబిచ్చింది. కరోనా‌ వైరస్‌ లాక్‌డౌన్‌ కాలంలో పేదల ప్రయోజనం కోసం తమ దేశంలో అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాన్ని భారత్‌ ఉదాహరణగా తీసుకోవాలని ఇమ్రాన్‌ ఖాన్‌ సలహా ఇచ్చారు. కాగా, తాము ప్రకటించిన కొవిడ్‌-19 ఉద్దీపన ప్యాకేజ్‌ విలువే పాక్‌ జీడీపీతో సమానమని భారత్‌ తిప్పికొట్టింది.

పాక్‌లో కరోనా నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఈ క్రమంలో తాము తొమ్మిది వారాల్లో, కోటి కుటుంబాలకు సుమారు రూ.12,000 కోట్ల రూపాయలను ఏ అవకతవకలూ లేకుండా అందించామన్నారు. తమ కార్యక్రమం అంతర్జాతీయంగా ప్రశంసలందుకుందుకోగా... భారత్‌లో పేదలు కరోనా లాక్‌డౌన్‌ వల్ల అష్టకష్టాలు పడుతున్నారని పాక్‌ ప్రధాని ఎద్దేవా చేశారు.  అవసరమైతే తమ అనుభవాన్ని భారత్‌కు పంచేందుకు సిద్ధమని ఇమ్రాన్‌ ఖాన్‌ వరుస ట్వీట్ల ద్వారా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తమ ప్రజల కంటే, బయటి వారికి (ఉగ్రవాదులకు) నగదు బదిలీ చేయటంలో పాక్‌ అంతర్జాతీయంగా పేరు పొందిందని... భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ ఎండకట్టారు.  జీడీపీలో 90 శాతానికి సమానమైన అప్పులతో... పాక్‌ రుణాల ఊబిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. కొత్త రుణాల కోసం వారు ఎంత అల్లాడి పోతున్నారో అందరికీ తెలుసని... అదే సమయంలో భారత్‌ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌ విలువ పాక్‌ జీడీపీతో సమానమని ఆయన ఎద్దేవా చేశారు. సరైన సమాచారం, గణాంకాల కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ తన సలహాదారుల బృందాన్ని మారిస్తే బాగుంటుందని శ్రీవాత్సవ పాక్‌ ప్రధానికి సలహా ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని