రాత్రిపూట కర్ఫ్యూ.. కేంద్రం కీలక సూచనలు
close
Published : 12/06/2020 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాత్రిపూట కర్ఫ్యూ.. కేంద్రం కీలక సూచనలు

దిల్లీ: కరోనా కారణంగా రాత్రిపూట విధించిన కర్ఫ్యూ విషయంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. రాత్రి వేళ్లలో గుంపులుగా, సమూహాలుగా తిరిగే వారిని నిలువరించడానికి మాత్రమే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది. జాతీయ/రాష్ట్రీయ రహదారులపై సరకు వాహనాలు; బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించి ఇంటికి చేరుకునే ప్రజలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు.

కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ సమయంలో జాతీయ రహదారులపై వ్యక్తులు, వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనవసర కార్యకలాపాల నివారణకు కోసం మాత్రమే కర్ఫ్యూ అని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో భౌతిక దూరం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై సరకు రవాణా వాహనాలను ఆపవద్దని లేఖలో పేర్కొన్నారు. తాజా మార్గదర్శకాలను జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులకు చేరవేయాలని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని