పాక్‌ కాల్పుల్ని తిప్పికొడుతూ అమరుడైన జవాన్‌
close
Updated : 14/06/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ కాల్పుల్ని తిప్పికొడుతూ అమరుడైన జవాన్‌

జమ్మూ: పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్‌పూర్‌-కెర్నీ సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెలలో పాక్‌ సైనిక కాల్పుల్ని తిప్పికొట్టే క్రమంలో ముగ్గురు జవాన్లు అమరులు కావడం విచారకరం. ఇంతకుముందు జూన్‌ 4న ఓ హవల్దార్‌, జూన్‌ 10న ఓ నాయక్‌ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలో పాక్‌ వైపు ఎంత మంది మృతిచెందారన్నది ఇంకా తెలియరాలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని