ఇతర దేశాల భూభాగం అంగుళమైనా వద్దు
close
Published : 14/06/2020 23:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇతర దేశాల భూభాగం అంగుళమైనా వద్దు

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

దిల్లీ : ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడంపై  భారత్‌కు ఏమాత్రం ఆసక్తిలేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. పొరుగు నుంచి మన దేశం ఆశిస్తున్నది కేవలం ‘శాంతి, స్నేహమేనని ఆయన తేల్చిచెప్పారు. గుజరాత్‌ జన్‌ సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గడ్కరీ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. అంతర్గత, విదేశాంగ భద్రత విషయంలో సున్నితంగా వ్యవహరించి శాంతిని నెలకొల్పడం ఈ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా వర్ణించారు. ‘మావోయిస్టుల సమస్యపై కానీ, పాక్‌ ప్రోద్బలంతో కొనసాగుతున్న ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కానీ దాదాపుగా విజయం సాధించాం. మనం శాంతిని కోరుతున్నాం.. విధ్వంసాన్ని కాదు’ అని గడ్కరీ పేర్కొన్నారు. బలమైన నాయకత్వం మూలంగానే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. అయితే ఆ బలాన్ని భూ విస్తరణ మార్గాల కోసం ఉపయోగించుకోలేదని చెప్పారు.

‘విస్తరణ మార్గాల ద్వారా భారత్‌ను బలమైన దేశం అని నిరూపించుకోవాలనుకోవడం లేదు. శాంతి స్థాపన ద్వారానే భారత్‌ను బలమైన దేశంగా తయారు చేయాలనుకుంటున్నాం’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గతంలో భారత్ అవలంబించిన విధానంపై కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు. ‘భారత్ ఎప్పుడూ భూటాన్‌ను ఆక్రమించాలని చూడలేదు. 1971లో బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి సహాయం చేసింది, అంతేగాని ఆదేశ భూబాగాన్ని ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. షేక్‌ ముజిబూర్‌ రెహమాన్‌ను బంగ్లా ప్రధాని పీఠంలో కూర్చొబెట్టిన తరువాతనే భారత సేనలు స్వదేశానికి చేరుకున్నాయి’’అని వివరించారు. పాకిస్థాన్‌తోగానీ, చైనాతో కానీ కావాల్సింది యుద్ధం కాదని, అందరితోనూ శాంతి, స్నేహంతో కలిసి పని చేయడమే కోరుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాగాంగ్‌ నది వద్ద నెల రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. చైనా ఆర్మీకి చెందిన పడవలు, హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఇరు దేశాల కమాండర్లు జూన్‌ 6న భేటీ అయిన విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని