ఇంతటి సంక్షోభంలోనూ తీరు మార్చుకోని పాక్‌!
close
Published : 16/06/2020 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంతటి సంక్షోభంలోనూ తీరు మార్చుకోని పాక్‌!

జెనీవా: ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి మెడలు వంచేందుకు తిరుగులేని పోరాటం చేస్తున్నాయి. ప్రజల్ని రక్షించుకునేందుకు వ్యూహ-ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ సంక్షోభం బయటపెట్టిన వ్యవస్థల్లోని లోపాలను చక్కబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకొని కొన్ని దేశాలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి. మార్పు దిశగా అడుగుల కోసం ప్రపంచ దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నాయి. కానీ, మన దాయాది దేశం పాకిస్థాన్‌ తీరు మాత్రం ‘కుక్క తోకర వంకర’ అన్న చందంగానే ఉంది. ఎప్పటిలాగే భారత్‌పై నిరాధార ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చా్ర్సీ)లో మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి తన సహజ వక్రబుద్ధిని చాటుకొంది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అర్థంలేని ఆరోపణలు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న మానవ హక్కుల సంక్షోభాన్ని ప్రస్తావించి.. దాని పరిష్కారాలపై చర్చించాల్సిన వేదికను రాజకీయం చేసేందుకు యత్నించింది. దీన్ని భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. పాక్‌ వైఖరిని ఉదాహరణల సహితంగా ఎండగట్టింది. 

తరచూ యూఎన్‌హెచ్చార్సీ వేదికను దుర్వినియోగం చేసే పాక్‌ ఈసారీ తన విధానాన్ని కొనసాగించిందంటూ ఐరాసలో భారత రాయబారి సెంథిల్‌ కుమార్‌ పాక్‌ తీరును బహిర్గతం చేశారు. దక్షిణాసియా దేశాల్లో నరమేధాన్ని ప్రోత్సహిస్తున్న ఏకైక దేశమైన పాక్‌.. మానవ హక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వారి వైఖరిని దుయ్యబట్టారు. తమ సంకుచిత రాజకీయ అజెండా కోసం యూఎన్‌హెచ్చార్సీ వంటి  అంతర్జాతీయ వేదికల్ని వాడుకోవడం ప్రమాదకరమైన అంశమని స్పష్టం చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు పాక్‌ తన చరిత్రను వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. కిడ్నాప్‌లు, మతమార్పిడిలు, హత్యలు, వేధింపులు, నిర్బంధ కేంద్రాలు, ఉగ్రవాద క్యాంపులకు అడ్డాగా ఉన్న ఓ దేశం భారత్‌ వంటి సహజ శాంతియుత దేశానికి హితవులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. 47 వేల మంది బలోచ్‌లు, 35 వేల మంది పష్తూన్ల ఆచూకీ ఏమైందో చెప్పగలరా అని పాకిస్థాన్‌ను సూటిగా ప్రశ్నించారు. హజారీలే లక్ష్యంగా జరిపిన హింసతో పాకిస్థాన్‌లో దాదాపు 500 మంది మరణించిన విషయాన్ని, లక్ష మంది వలవెళ్లిన అంశాన్ని గుర్తుచేశారు. ఇటీవల పాక్‌లో సింధ్‌ ప్రాంతంలో హిందూ, క్రైస్తవ బాలికలపై జరిగిన దాడిని ప్రస్తావించారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఎలా వ్యవస్థీకృతమయ్యాయో వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని