ప్రవీణ్‌కు యావజ్జీవ శిక్ష సరైందే: సుప్రీం
close
Published : 16/06/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రవీణ్‌కు యావజ్జీవ శిక్ష సరైందే: సుప్రీం

హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం

దిల్లీ‌: హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన పి.ప్రవీణ్‌ శిక్ష విషయంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అతడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.  హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పు దోషికి పూర్తిస్థాయి శిక్షను విధించినట్టు గానే ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధిస్తే నేరస్థులకు సరైన సంకేతాలు వెళ్తాయన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనపై స్పందిస్తూ.. తుదిశ్వాస విడిచేవరకు జైలుశిక్ష కూడా సరైన సంకేతాలనే ఇస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం.. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలను జారీచేసింది.

గతేడాది జూన్‌ 6న హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపింది. దీనిపై కింది కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించగా.. ఆ శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  అయితే అతడు అంతిమ శ్వాస విడిచే వరకు జైలు జీవితాన్ని అనుభవించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని