దిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్
close
Published : 18/06/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్

మహిళా ఎమ్మెల్యేకూ కరోనా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల సత్యేంద్ర జైన్‌కు అస్వస్థతగా ఉండటంతో ఆయనను స్థానిక రాజీవ్‌ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ అని వచ్చింది. బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే అతిషికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఆమెకు జ్వరం, దగ్గు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు ఆమె నుంచి నమూనాలను సేకరించారు. తాజా ఫలితాల్లో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా అతిషి దిల్లీ వైద్యారోగ్య విభాగంతో కలిసి పనిచేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని