భారత్‌ Vs చైనా.. మధ్యలో రష్యా!
close
Published : 22/06/2020 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ Vs చైనా.. మధ్యలో రష్యా!

మాస్కోలో ఒకే వేదికపైకి రాజ్‌నాథ్‌, ఫెంగీ

మిత్రదేశాల మధ్య సయోధ్యకు రష్యా యత్నం

మాస్కో: భారత్‌- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇరు దేశాల  రక్షణ మంత్రులు ఒకే వేదికపై ఎదురుపడనున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో బుధవారం జరిగే  రష్యా విక్టరీ పరేడ్‌ ఇందుకు వేదిక కానుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు మాట్లాడుకొనే అవకాశం ఉంది. వారి సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఏ మాట్లాడతారోనన్న ఆసక్తి!
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భీకర ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారాయి. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థితిలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి యీ ఫెంగీ ముఖాముఖి ఎదురుపడటం.. ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరి మధ్యా అధికారిక సమావేశానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనా లేకపోయినప్పటికీ.. భేటీ అయ్యేలా చేసేందుకు రష్యా ఈ ఏర్పాటు చేసినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

సయోధ్యకు రష్యా యత్నం
రక్షణ మంత్రులు ఒకే వేదికను పంచుకోవడానికి ముందు రోజు భారత్‌ - చైనా విదేశాంగ మంత్రులు జయశంకర్‌, వాంగ్‌ యీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. రష్యా విదేశాంగ మంత్రి కూడా ఇందులో పాల్గొంటారు. ఈ త్రైపాక్షిక భేటీని రష్యానే ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశాల ద్వారా భారత్‌- చైనా మధ్య రష్యా సహజ మధ్యవర్తి పాత్రను పోషిస్తోంది. మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ ఇరు దేశాలూ తిరస్కరించాయి. అందుకే దీన్ని రష్యా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. మిత్ర దేశాల మధ్య సయోధ్య కుదర్చాలని చూస్తోంది. 

రష్యా విక్టరీ పరేడ్‌ మే 9న జరగాల్సింది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి స్మారకంగా మాస్కోలో ఏటా రష్యా ఈ పరేడ్‌ నిర్వహిస్తోంది. ఇది 75వ వార్షికోత్సవం కావడంతో 13 దేశాలను ఆహ్వానించి ఘనంగా ఏర్పాట్లు చేసింది. పరేడ్‌లో పాల్గొనేందుకు 75మంది సభ్యుల బృందాన్ని భారత్‌ పంపింది. చైనా నుంచి 106మంది సభ్యుల బృందం ఇప్పటికే మాస్కో చేరుకుంది. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని