కరోనాపై పోరుకు సిద్ధమైన వైద్య విద్యార్థులు
close
Updated : 22/06/2020 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పోరుకు సిద్ధమైన వైద్య విద్యార్థులు

వారి సేవలు వినియోగించుకోనున్న హరియాణా ప్రభుత్వం

చండీగఢ్‌: కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థులను రంగంలోకి దించనున్నట్లు హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థుల సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. ఆదివారం కొవిడ్ -19తో హరియాణాలో 11 మంది మరణించారు. 412 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి సంఖ్య 10,635కు చేరుకుందని, ఇప్పటివరకు 160 మంది మృత్యువాత పడినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు చెందిన 1,106 మంది ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులకు కొవిడ్ విధులు కేటాయించినట్లు రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టర్ జనరల్ తెలిపారు. జూన్‌ 22వ తేదీలోపు వారు సంబంధిత జిల్లాల సివిల్ సర్జన్లకు నివేదించాలని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అదనపు వైద్య సిబ్బంది అవసరముందని, అందుకు తగినట్లుగా ఆరోగ్య సదుపాయాలను సృష్టించే పనిలో ఉన్నట్లు ప్రభుత్వం జూన్ 19 విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 11 కళాశాలల ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల సేవలను వినియోగించుకోనున్నటు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మెడికల్ కాలేజీల డైరెక్టర్లు, సివిల్ సర్జన్లు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల శిక్షణ ఇవ్వాలని సూచించింది. విద్యార్థుల బోర్డింగ్, బస ఏర్పాట్లను కూడా చూడాలని పేర్కొంది.  

గత మూడు వారాలుగా హరియణాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గుడ్‌గావ్‌, ఫరీదాబాద్ కేసుల తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో ఆదివారం 11 మంది మరణించగా అందులో 9 మంది ఈ రెండు పట్టణాలకు చెందిన వారే. రాష్ట్రంలో మొత్తం 10,635 మంది మహమ్మారి బారిన పడగా అందులో గుర్గావ్‌ నుంచే 4,427 మంది ఉన్నారు. ఫరీదాబాద్‌లో 2,237 కేసులు నమోదయ్యాయి. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని