పాక్‌ హైకమిషన్‌లో సిబ్బంది తగ్గింపు
close
Published : 23/06/2020 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ హైకమిషన్‌లో సిబ్బంది తగ్గింపు

2001 తర్వాత ఇదే తొలిసారి..

దిల్లీ: పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఉద్యోగుల కార్యకలాపాలపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ కార్యాలయంలో సిబ్బందిని తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైకమిషన్ అధికారులు గూఢచర్య కార్యకలాపాలు సాగిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్‌ దౌత్యవేత్తను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి భారత అధికారులు వివరించారు. 
అంతర్జాతీయ నిబంధనలు, ద్వైపాక్షిక ఒప్పందాలను అనుసరించడంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. 
పాకిస్థాన్ హైకమిషన్ అధికారులు ఉగ్రవాద సంస్థలతో సంప్రదిస్తున్నారని దౌత్యవేత్తకు కేంద్రం తెలిపింది. పాక్ హైకమిషన్‌లో ప్రస్తుతం ఉన్న 110 మంది సిబ్బందిని 55కు తగ్గించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని వారంలోపు అమలు చేయనున్నారు. 

ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ అధికారులను నిరంతరం వేధిస్తున్నారని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం తెలిపింది. ఇటీవల ఇద్దరు అధికారులను గన్‌పాయింట్ వద్ద అపహరించి, ఒకరోజంతా హింసించారని పేర్కొంది. పాకిస్థాన్‌ నుంచి తిరిగి వచ్చిన భారత అధికారులు...  పాక్ ఏజెన్సీల క్రూరత్వం గురించి సమాచారం ఇచ్చారని కేంద్రం తెలిపింది. పార్లమెంటుపై దాడి జరిగిన తర్వాత 2001లో హైకమిషన్ సిబ్బందిని తొలగించాలని తొలిసారి నిర్ణయించారు. 

దాడి ఆధారాలు బయట పెట్టి అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఇవాళ..  హైకమిషన్ సిబ్బందిని తగ్గించాలంటూ భారత విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని