వ్యాక్సిన్‌ రేసులో వారిద్దరే ముందున్నారు: WHO
close
Published : 26/06/2020 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ రేసులో వారిద్దరే ముందున్నారు: WHO

జెనీవా: కరోనా వైరస్‌ సూదిమందుపై ఆశలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లోనే ఇది అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీని అభివృద్ధి, సామర్థ్యంలో ఆస్ట్రాజెనికా అందరికన్నా ముందంజలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మోడెర్నా వ్యాక్సిన్‌ సైతం ఆస్ట్రాజెనికా కన్నా మరీ వెనకేం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా 15 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సినోవాక్‌ సహా చైనాకు చెందిన బహుళ సంస్థలతో సూదిమందు అభివృద్ధి గురించి డబ్ల్యూహెచ్‌వో మాట్లాడిందని వెల్లడించారు. సంస్థలో కొన్ని డ్రగ్స్‌కు జరుగుతున్న సంఘీభావ ట్రయల్స్‌ మాదిరిగానే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఆమె పిలుపునిచ్చారు.

కొవిడ్‌-19 సూదిమందు ఏడాదిలోపు వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెయేసుస్‌ ఐరోపా పార్లమెంటు కమిటీ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి స్పందన విషయంలో తమవైపు నుంచి తప్పులు జరిగినట్టు ఆయన అంగీకరించారు. వీటి నుంచి పాఠాలు నేర్చుకొనేందుకు మదింపు కమిటీ వేస్తున్నామని ఆయన వెల్లడించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని