గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించదు!
close
Published : 06/07/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించదు!

 సెంట్రల్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ శేఖర్‌ మండే 


దిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అర్రులు చాస్తోంది. నెలల వ్యవధిలోనే భూగోళాన్ని చుట్టేసింది. ఈ వైరస్‌కు  ఔషధాన్ని కనుగొనే పనిలో పలు ఔషధ కంపెనీలు తలమునకలవుతున్నాయి. మరోవైపు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతోందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడం ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది.  ఇటీవల కాలంలో ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందన్న వినిపిస్తున్నాయి. ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్యుల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసింది. దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. అయితే  తాజాగా కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించేది కాదని  సెంట్రల్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ శేఖర్‌ మండే ఓ వార్త సంస్థతో చెప్పారు. ‘‘ కరోనా గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ కాదు. కానీ, ఈ వైరస్‌ సోకిన వ్యక్తి  దగ్గడం, తుమ్మడం వల్ల వెలువవడే తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోవచ్చు.’’ అని శేఖర్‌ మండే చెప్పారు.

‘‘చికెన్‌పాక్స్‌,ఇన్‌ఫ్లూయెంజా, కొన్ని రకాల ఫ్లూ వైరస్‌లు గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి.  కానీ తుంపర్ల ద్వారా  ఒకరి నుంచి మరొకరికి వస్తున్నందున  దీనిని గాలి ద్వారా సంక్రమించే వ్యాధిగా అభిప్రాయపడుతున్నారని’’ ఆయన చెప్పుకొచ్చారు. వైద్యుల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖరాసిన విషయంపై స్పందిస్తూ..  ఈ విషయాన్ని నిర్ధారించడం అంత సులువేమీ కాదని, సాంకేతిక ఆధారాల కోసం డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నిస్తోందని చెప్పారు.
 
కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందబోదని, మీరు డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారా? అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి వరకు ఎలాంటి లేఖలు రాయలేదని,  అవసరమైతే త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశముందని శేఖర్‌ మండే అన్నారు. మరోవైపు వైరస్‌ సోకకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శేఖర్‌ మండే సూచించారు. వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఇంటికే పరిమితం కావాలన్నారు. మాస్కులు ధరించాలని, కరోనా రోగులకు చికిత్స చేస్తున్న సిబ్బంది తప్పని సరిగా ఎన్‌95 మాస్కులు ధరించాలని కోరారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని