భారత్‌లో సమూహవ్యాప్తి లేదు: హర్షవర్ధన్‌
close
Published : 09/07/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో సమూహవ్యాప్తి లేదు: హర్షవర్ధన్‌

ప్రపంచంలో మూడో స్థానానికి భారత్

దిల్లీ: ప్రపంచంలోనే కరోనా కేసుల నమోదులో భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఈ పరిణామాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ‘‘జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం. మన దేశంలో ప్రతి పది లక్షల మందికి 538 కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 1,453గా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 62.08 శాతం మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 2.75 శాతంగా ఉంది. కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే 90 శాతం కేసులు నమోదవుతున్నాయి. వీటిలో ఆరు రాష్ట్రాల్లో 86 శాతం మరణాలు సంభవించాయి’’ అని తెలిపారు.

‘‘ఈ రోజు జరిగిన సమావేశంలో భారత్‌లో వైరస్‌ సమూహ వ్యాప్తి దశలో లేదని మరోసారి నిపుణులు స్పష్టం చేశారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ సమూహవ్యాప్తి జరిగి ఉండవచ్చు. కానీ, దేశం మొత్తం మీద ఎక్కడా సమూహవ్యాప్తి లేదు’’ అని ఆరోగ్య మంత్రి తెలిపారు. భారత్‌లో కరోనా వ్యాపిస్తున్న తీరుపై  హర్షవర్ధన్‌ పలువురు మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఐసీయూ, ఆక్సిజన్‌ సదుపాయం కలిగిన బెడ్లు, వెంటిలేటర్లు వంటి ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన పెంచుకుంటూ పోవడం ద్వారా ఈ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో రోజువారీ కరోనా గణాంకాల విడుదలలో భాగంగా హర్షవర్ధన్‌ ఈ వివరాలను వెల్లడించారు. గురువారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 7,67,296 మందికి కరోనా సోకగా వారిలో ఇప్పటి వరకు 4,76,378 మంది కోలుకోగా మరో 2,69,789 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం 2,06,588గా ఉందని అన్నారు. అలానే కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 21,129 మంది మృతిచెందారని వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని