ఆ ప్రాంతాల్లోనే గాలిలో వైర‌స్‌ వ్యాప్తి!
close
Published : 10/07/2020 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ప్రాంతాల్లోనే గాలిలో వైర‌స్‌ వ్యాప్తి!

ఇండోర్ ప్ర‌దేశాలు, వెంటిలేష‌న్‌లేని ప్రాంతాల్లోనే ఆస్కారం
ల‌క్ష‌ణాలున్న వారినుంచే వ్యాప్తి ఎక్కు‌వ
స్ప‌ష్ట‌త‌నిచ్చిన‌ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

లండ‌న్‌: క‌రోనా వైర‌స్ గాలిద్వారా వ్యాపిస్తోంద‌న్న వాద‌న గ‌త కొన్నిరోజులుగా మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని కోరుతూ దాదాపు 200మందికిపైగా శాస్త్రవేత్త‌లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాశారు. ప‌రిశీల‌న అనంత‌రం గాలిద్వారా వైర‌స్ వ్యాపించే అవ‌కాశాన్ని అంగీక‌రించిన డ‌బ్ల్యూహెచ్ఓ, కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృంద‌గానం చేసే ప్ర‌దేశాలు, వ్యాయామ త‌రగ‌తులు నిర్వ‌హించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది.

వైర‌స్ సోకిన వ్య‌క్తులు మాట్లాడ‌టం, ద‌గ్గిన‌ప్పుడు తుంప‌రులు కొంత‌శాతం గాలిలో ఉండిపోతాయ‌ని ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త‌లు వాదిస్తున్నారు. ఈ సంద‌ర్భంలో జాతీయ, అంత‌ర్జాతీయ నిపుణులు, అధికారులు దీన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని క‌ఠినమైన ర‌క్ష‌ణ‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. దీనిలోభాగంగా డ‌బ్ల్యూహెచ్ఓ కూడా క‌రోనాకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌వ‌రించాల‌ని కోరారు. అయితే, ఈ వైర‌స్ గాలిలో వ్యాపిస్తోంద‌న్న వాద‌న‌ను గ‌త కొంత‌కాలంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చుతూనే ఉంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రోగులను శ్వాస యంత్రాల‌పై ఉంచే సందర్భాల్లో మాత్ర‌మే వైర‌స్ అలా వ్యాపిస్తోందని వాదిస్తోంది.

తాజాగా దాన్ని పున‌:ప‌రిశీలించిన అనంత‌రం వైర‌స్ కొన్ని ప్రాంతాల్లో గాలిలో వ్యాపించే ఆస్కారం ఉన్నట్లు డ‌బ్ల్యూహెచ్ఓ స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఇండోర్ ప్ర‌దేశాలు, ఎక్కువ వెంటిలేష‌న్ లేని ప్రాంతాల్లో వైర‌స్ సోకిన వ్య‌క్తుల నుంచి ఇది మ‌రింతమందికి వ్యాపించే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని తెలిపింది. వీటితోపాటు వైర‌స్ సోకిన వ్య‌క్తులు తిరిగిన ప్ర‌దేశాలు లేదా ఇండోర్ ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు స‌న్నిహితంగా మెల‌గ‌డం వ‌ల్ల‌ వైర‌స్ వ్యాప్తిచెందే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని పేర్కొంది.

ఎసింప్ట‌మేటిక్ కేసుల‌తో వ్యాప్తి త‌క్కువే..!

ఎసింప్ట‌మేటిక్(ల‌క్ష‌ణాలు కనిపించ‌ని) వ్య‌క్తుల‌తోనూ వైర‌స్‌ వ్యాప్తి పెరుగుతున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్న‌ శాస్త్రవేత్త‌ల సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతోంది. వైర‌స్‌ని వ్యాప్తి చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఎసింప్ట‌మేటిక్ వ్య‌క్తులలో ఉన్న‌ప్ప‌టికీ, ఇది చాలా అరుదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ల‌క్ష‌ణాలు లేనివారి నుంచి వైర‌స్ సంక్ర‌మ‌ణ స‌మాజంలో ఏస్థాయిలో ఉందో నిజంగా ఇప్ప‌టివ‌రకు తెలియ‌ద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ అభిప్రాయ‌ప‌డింది. ఎక్కువశాతం వైర‌స్ సోకిన వ్య‌క్తులు ద‌గ్గు, తుమ్మిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌రుల ద్వారానే వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లు మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

ఇవీ చ‌ద‌వండి..

గాలి ద్వారానూ క‌రోనా వ్యాప్తి!
భార‌త్‌లో 8ల‌క్ష‌ల‌కు చేరువ‌లో కేసులు


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని