సౌర వెలుగుల్లో భారత్‌ కొత్త శిఖరాలకు..
close
Published : 10/07/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సౌర వెలుగుల్లో భారత్‌ కొత్త శిఖరాలకు..

ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ పార్కును ప్రారంభించిన మోదీ

రీవా: శుద్ధ ఇంధన రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్‌ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ పార్కు ఏర్పాటైంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పార్కుని శుక్రవారం ప్రారంభించిన మోదీ.. దీన్ని  జాతికి అంకితం చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ శుద్ధ, సౌర ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. సౌర శక్తి శుద్ధమైన, భద్రతమైన, భరోసా కల్పించే ఇంధనమని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్‌ నిలిచిందన్నారు. 

పర్యావరణహిత విద్యుత్‌ వినియోగానికి ప్రోత్సహిస్తూ.. దేశవ్యాప్తంగా 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అందజేశామని ప్రధాని తెలిపారు. దీంతో డిమాండ్‌ పెరిగి ఉత్పత్తి పెరిగిందని.. తద్వారా ఆరేళ్లలో వాటి ధర పదింతలు తగ్గాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విద్యుత్‌ రంగానిది చాలా కీలక భూమిక అని వివరించారు. అభివృద్ధిలో భారత్‌ కొత్త శిఖరాలకు ఎదుగుతున్న కొద్దీ మన ఆశలు, ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. అదే స్థాయిలో మన చమురు, విద్యుత్‌ అవసరాలు కూడా పెరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం చాలా కీలకమన్నారు.   

రూ. 4,500 కోట్లతో రీవా సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్కులోని మూడు విభాగాల్లో 250 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో 24 శాతం విద్యుత్‌ను దిల్లీ మెట్రోకు సరఫరా చేయనున్నారు.

భారత్‌ ఆదర్శం: ఐరాస

కరోనా సంక్షోభ సమయంలోనూ సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తూ భారత్‌ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నమోదు చేసే రంగం కేవలం పునరుత్పాదక ఇంధన రంగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ‘క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌ సమ్మిట్‌’ పేరిట గురువారం జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకునే దిశగా ప్రపంచ దేశాలు తయారు చేస్తున్న ప్రణాళికల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. ఈ విషయంలో  ఒక్క భారత్‌ మాత్రమే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 2050 నాటికి భూమిని కర్బన ఉద్గారాలరహిత గ్రహంగా మార్చాలని పిలుపునిచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని