వచ్చే ఏడాది ఆరంభంలో కొవిడ్‌-19కు టీకా
close
Published : 11/07/2020 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే ఏడాది ఆరంభంలో కొవిడ్‌-19కు టీకా

పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలిపిన ప్రభుత్వం

దిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొవిడ్‌-19కు టీకా సాకారమవుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ; శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌), ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు శుక్రవారం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలిపారు. ఈ సంఘానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ నేతృత్వం వహిస్తున్నారు. మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ తర్వాత ఈ కమిటీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. కొవిడ్‌-19 విషయంలో ప్రభుత్వ సన్నద్ధతపైనా తాజా సమావేశంలో సమీక్ష జరిగింది. స్థాయీ సంఘాల భేటీలు పునఃప్రారంభం కావడంపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తంచేశారు. కరోనా మహమ్మారి వల్ల స్థాయీ సంఘాల సమావేశాలపై ప్రభావం పడిందన్నారు. మరోవైపు వర్చువల్‌ సమావేశాలు నిర్వహించడానికి అనుమతివ్వాలని వెంకయ్య నాయుడిని జైరామ్‌ రమేశ్‌ ట్విటర్‌ ద్వారా కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని