కొవిడ్‌-19కు ఒకే డోసు టీకా
close
Published : 01/03/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌-19కు ఒకే డోసు టీకా

అమెరికా, చైనాల్లో అనుమతి 

వాషింగ్టన్‌/ బీజింగ్‌: కొవిడ్‌-19 నివారణకు ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’  రూపొందించిన ఒకే డోసు టీకాకు అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగం కోసం ఆమోదం తెలిపింది. దీంతో ఈ మహమ్మారిపై పోరు కోసం దేశంలో మూడో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లయింది. కొవిడ్‌ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఇది స్వాగతించగదగ్గ పరిణామమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటికే ఆమోదం పొందిన ఫైజర్, మోడెర్నా టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాలి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ వ్యాక్సిన్‌ మాత్రం ఒకే డోసుతోనే రక్షణ కల్పిస్తుందని ఎఫ్‌డీఐ పేర్కొంది. అమెరికా సహా పలు దేశాల్లో నిర్వహించిన క్లినికల్‌ ప్రయోగాల్లో ఈ టీకా సమర్థంగా పనిచేస్తుందని వెల్లడైనట్లు తెలిపింది. ఒక డోసుతో అత్యంత తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్‌ను 85 శాతం మేర నివారిస్తుందని పేర్కొంది. కొత్త రకం కరోనా వైరస్‌లు ఆందోళనకరంగా వ్యాపిస్తున్న దక్షిణాఫ్రికాలోనూ ఇది సమర్థంగా పనిచేసినట్లు తెలిపింది. ఫైజర్, మోడెర్నా టీకాలతో పోలిస్తే జాన్సన్‌ టీకా నిర్వహణ చాలా తేలికని నిపుణులు పేర్కొన్నారు. 

మేము సైతం: చైనా  

మరోవైపు చైనా కూడా ఒకే డోసుతో కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే టీకాకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ఏడీ5-ఎన్‌కోవ్‌ అనే ఈ వ్యాక్సిన్‌ను చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్‌ సంస్థ రూపొందించింది. దీన్ని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌కు పోటీగా తెచ్చినట్లు భావిస్తున్నారు. ఏడీ5-ఎన్‌కోవ్‌ను పొందిన 14 రోజుల్లోనే శరీరంలో రోగనిరోధక రక్షణ మొదలవుతుందని అధికార గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని