Corona: ఆసుపత్రి అవసరం 0.06% మందికే!
close
Updated : 17/05/2021 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఆసుపత్రి అవసరం 0.06% మందికే!

వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో 97.38% మందికి రక్షణ
అపోలో ఇంద్రప్రస్థ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నా.. ఆసుపత్రిలో చేరాల్సినంత ఇబ్బంది దాదాపుగా ఉండదని తాజా అధ్యయనం చెబుతోంది. కేవలం 0.06 శాతం మందికే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటుందని దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి తెలిపింది. తొలి 100 రోజుల వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కొవిడ్‌ లక్షణాలతో రిపోర్ట్‌ చేసిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై ఈ ఆసుపత్రి అధ్యయనం నిర్వహించింది. ‘వ్యాక్సినేషన్‌ తర్వాత ఇన్‌ఫెక్షన్‌’ పేరుతో ఫలితాలను వెల్లడించింది. ‘‘వ్యాక్సినేషన్‌ వంద శాతం కొవిడ్‌ నిరోధక శక్తిని ఇవ్వదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వ్యాధి సోకినా తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా రక్షిస్తుంది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో 97.38 శాతం కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ పొందారు. కొవిడ్‌ సోకిన వారిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 0.06 శాతం మందిలోనే కలిగింది’’ అని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డా.అనుపమ్‌ సిబల్‌ తెలిపారు. కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్న 3,235 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం నిర్వహించగా.. వీరిలో 85 మంది వ్యాధి బారిన పడ్డారు. ఇందులో 65 మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోగా.. 20 మందికి ఒక డోసు మాత్రమే పూర్తయింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని