Coronavaccine: 20 కోట్లు దాటిన టీకా డోసులు
close
Updated : 26/05/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavaccine: 20 కోట్లు దాటిన టీకా డోసులు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలకు అందించిన కొవిడ్‌ టీకా డోసుల సంఖ్య మంగళవారం 20 కోట్లు దాటింది. జనవరి 16 నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దశలవారీగా విస్తృతమై 130వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు అనుమతిస్తుండగా.. ఇంతవరకు అందించిన మొత్తం డోసుల సంఖ్య 20,04,94,991కి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంతవరకు 15,69,99,310 మందికి మొదటి డోసు.. 4,34,95,681 మందికి రెండో డోసు అందించారు.
ఎవరికి ఎన్ని డోసులు?
దేశంలో ఇంతవరకు 18-44 ఏళ్ల వయసువారిలో 1,28,74,546 మందికి కొవిడ్‌ టీకా తొలి డోసు వేశారు. ఆరోగ్య సిబ్బందిలో 97,94,835 మందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో 1,51,62,077 మందికి, 45-60 ఏళ్ల మధ్య వయసువారిలో 6,20,47,952 మందికి, 60ఏళ్లు పైబడిన వారు 5,71,19,900 మందికి తొలి డోసు వేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 67,28,443 మంది ఆరోగ్య సిబ్బంది, 83,77,270 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 1,00,24,157 మంది 45-60 ఏళ్ల మధ్య వయస్కులు, 60ఏళ్లు పైబడిన 1,83,65,811 మందికి రెండో డోసు వేశారు.

 

కరోనా టీకాల వేగం పెంచండి
రాష్ట్రాలకు సూచించిన కేంద్రం

దిల్లీ: అందుబాటులో ఉన్న నిల్వలతో కరోనా టీకాల వేగాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. జూన్‌ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్న నిల్వలను దీనికోసం గమనంలో తీసుకోవాలని తెలిపింది. జిల్లాలు, వ్యాక్సిన్‌ కేంద్రాల వారీగా ప్రణాళికలు రూపొందించి, దానిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పింది. రిజిస్ట్రేషన్లన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాల్సి ఉన్నందున ఆఫ్‌లైన్‌లో దీనికి అవకాశం కల్పించవద్దని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల పురోగతిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్రం సమీక్ష నిర్వహించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని