Pak: గతం మరిచి.. ఇంకా పాక్‌లోనే ఆ 17 మంది!
close
Published : 07/06/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pak: గతం మరిచి.. ఇంకా పాక్‌లోనే ఆ 17 మంది!

పాక్‌ జైళ్లలో మగ్గుతున్న భారతీయులు

దిల్లీ: ఆరేళ్లు గడిచిపోయాయి.. ‘మానసికంగా దుర్బలంగా ఉన్న మీవాళ్లు 17 మంది మా దేశం జైళ్లలో ఉన్నారు. శిక్షాకాలం కూడా పూర్తయింది. ఎవరైనా గుర్తిస్తారేమో చూడండి’ అని పాకిస్థాన్‌ 2015లో మన దేశానికి సమాచారం ఇచ్చింది. భారత హోం మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్‌సైటులో వారి చిత్రాలు పెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పంపింది. వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలని కోరింది. భారతీయులుగా భావిస్తున్న వీరు బంధువుల పేర్లు, చిరునామా ఏదీ చెప్పలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ ఆరేళ్లలో ఆ అభాగ్యులను గుర్తించే ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదని హోం మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు.  ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కూడా వివరాలు రాబట్టేందుకు విఫలయత్నం చేసింది. ఫలితంగా.. ఆరేళ్లుగా  భారత్‌ సహా ఏ దేశానికీ వారిని అప్పగించలేకపోతున్నామని పాక్‌ అధికారవర్గాలు చెబుతున్నాయి. 
భారత్, పాక్‌ ఖైదీల వివరాలను రెండు దేశాలు ఏటా రెండుసార్లు పరస్పరం  ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. శిక్షాకాలం ముగిసినా పాక్‌లోనే ఉంటున్న 17 మందిలో నలుగురు మహిళలు.

17 మంది వీరే..

గుల్లుజాన్, అజ్మీరా, నఖాయా, హసీనా. సోనూసింగ్, సురీందర్‌ మహతో, ప్రహ్లాద్‌సింగ్, సిల్రోఫ్‌ సలీం, బిర్జు, రాజు, బిప్లా, రుపి పల్, పన్వాసీలాల్, రాజు మహౌలి, శ్యాంసుందర్, రమేశ్, రాజు రాయ్‌. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని