Vaccine: సాధారణ టీకాలకు దూరమవుతున్న పిల్లలు
close
Updated : 16/09/2021 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: సాధారణ టీకాలకు దూరమవుతున్న పిల్లలు

కొవిడ్‌ రేపుతున్న కల్లోల ప్రభావం
కొంత ఆలస్యమైనా వేయించాల్సిందేనంటున్న నిపుణులు

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి రేపుతున్న ‘అల’కల్లోలం ఎన్నోవిధాలుగా ప్రభావం చూపుతోంది. మహమ్మారి రెండో ఉద్ధృతిలో కరోనాకు భయపడి దేశంలో చాలామంది తల్లిదండ్రులు పసిపిల్లలకు సాధారణ టీకాలనూ వేయించడం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే ఈ టీకాలను వేయించకపోవడం ముప్పుగా పరిణమించొచ్చని హెచ్చరిస్తున్నారు. అధికారిక అంచనాల ప్రకారం దేశంలో 20 లక్షల నుంచి 22 లక్షల వరకు ఏడాది లోపు పిల్లలకు ప్రతి నెలా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల కింద ఇచ్చే సాధారణ టీకాలను వేయించడం లేదని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఏడాదికి సుమారు 2.6 కోట్ల మంది పిల్లలకు సాధారణ వ్యాక్సినేషన్‌ జరగడం లేదు.

కరోనాకు భయపడి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు డీటీపీ (కంఠసర్పి, ధనుర్వాతం, కోరింతదగ్గు), నూమోకోకల్, రోటా వైరస్, ఎంఎంఆర్‌ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) తదితర వ్యాధులను నివారించే టీకాలను వేయించడం లేదని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్‌ రెండో ఉద్ధృతి సమయంలో 18 నెలల లోపు పిల్లలకు సాధారణ వ్యాక్సినేషన్‌ దాదాపు 60 - 70 శాతం పడిపోయినట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఒకటి రెండు నెలలు ఆలస్యమైనప్పటికీ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలని సూచించారు. కరోనా మొదటి ఉద్ధృతి సమయంలోనూ పిల్లలకు వ్యాక్సినేషన్‌ తగ్గినట్లు చెప్పారు. కొవిడ్‌ భయంతోనే పిల్లలను ఆసుపత్రులకు తీసుకెళ్లడం లేదని.. లాక్‌డౌన్‌ ఆంక్షలు కూడా ప్రతిబంధకంగా మారినట్లు తెలిపారు. టీకాలు వేయించడం ఆలస్యమవుతున్న కొద్దీ అవి అడ్డుకునే వ్యాధుల ముప్పు పెరుగుతుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ప్రాథమికంగా అవసరమయ్యే టీకాలు తప్పనిసరి అని.. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రులకు తీసుకొచ్చి టీకాలు వేయించాలని సూచించారు. కాగా కొన్ని ఆసుపత్రులు హోం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కూడా నిర్వహిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుని ఇళ్లవద్దే పిల్లలకు టీకాలు వేయించుకోవచ్చని తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని