Vaccine: పేటీఎం, మేక్‌మైట్రిప్‌ ద్వారా వాక్సిన్‌ నమోదు బుకింగ్‌
close
Published : 16/06/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: పేటీఎం, మేక్‌మైట్రిప్‌ ద్వారా వాక్సిన్‌ నమోదు బుకింగ్‌

కేంద్రం ఆమోదం: త్వరలోనే అమల్లోకి..

 దిల్లీ: టీకా వేయించుకోవటానికి స్లాట్‌ బుక్‌ చేసుకోవటం, వేయించుకున్నాక సర్టిఫికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవటం ఇకమీదట సులభతరం కాబోతోంది. కొవిన్, ఆరోగ్యసేతులాంటి ప్రభుత్వ వేదికలపై ఒత్తిడి తగ్గించటమే కాకుండా... వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో 81 ప్రైవేటు వేదికలకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. త్వరలోనే పేటీఎం, ఐబిబో గ్రూప్‌ మేక్‌మై ట్రిప్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా కూడా ప్రజలు టీకాల బుకింగ్, వేయించుకున్నాక టీకాల సర్టిఫికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొవిన్, ఆరోగ్య సేతు యాప్‌ల ద్వారా మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. తాజాగా... ఈ పనికి... 145 సంస్థల నుంచి కేంద్ర ఆరోగ్య అథారిటీకి దరఖాస్తులు వచ్చాయి. 91 దరఖాస్తులను ఆమోదించారు. వీటిలో 81 ప్రైవేటువి కాగా... 10 ప్రభుత్వరంగ వేదికలు. ప్రైవేటు వాటిలో... అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ లాంబార్డ్, మాక్స్‌ హెల్త్‌కేర్, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్, ఇన్ఫోసిస్, శివం ఇ-కామర్స్, సినెర్జిక్‌ ఇన్ఫో... తదితర సంస్థలున్నాయి. ప్రభుత్వ రంగంలో... కేరళ, కర్ణాటక, యూపీ, బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య విభాగాలు; ఐఐటీ ముంబై, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, ఇస్రో, నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ తదితరాలున్నాయి. తమ సొంత పోర్టల్‌లను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా... వారివారి యాప్స్‌ను కొవిన్‌తో అనుసంధానం చేసుకోవటానికి అనుమతిస్తారు. వీటన్నింటి ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. తేదీని మార్చుకోవచ్చు. రద్దు చేసుకోవచ్చు. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకొని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తద్వారా... డేటాకు భద్రత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే వీటి ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని