Delhi: ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించి.. ఒకేసారి నలుగురికి అమ్మయింది!
close
Published : 01/08/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Delhi: ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించి.. ఒకేసారి నలుగురికి అమ్మయింది!

దిల్లీ: పెళ్లయిన తర్వాత ఎనిమిదేళ్ల వరకూ పిల్లలు కలగక, ఇక కలగరని ఆశలు వదులుకున్న దంపతులు... అవధుల్లేని ఆనందానికి లోనయ్యారు! సుదీర్ఘ నిరీక్షణ ఫలించి, ఒకేసారి వారికి నలుగురు సంతానం కలిగారు. వీరిలో ఒకరు అమ్మాయి కాగా, మిగతా ముగ్గురు అబ్బాయిలు. గాజియాబాద్‌కు చెందిన దంపతులు... సంతానం కోసం ఎందరో వైద్యులను సంప్రదించారు. ఐసీయూ వంటి సాంకేతికతల సాయంతో వైద్యం పొందారు. ఎనిమిదేళ్లు గడిచినా ఫలితం లేకపోయింది. చివరిగా వారు దిల్లీలోని ‘సీడ్స్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌’ ఆసుపత్రి డైరెక్టర్‌ డా.గౌరి అగర్వాల్‌ను సంప్రదించారు. అన్ని వైద్య నివేదికలను పరీక్షించి, ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగే అవకాశముందని ఆమె సూచించారు. ఈ విధానంలో వైద్యం అందించడం ద్వారా... గృహిణిగా ఉంటున్న ఆ మహిళ(32) గర్భం దాల్చారు. 33 వారాల తర్వాత శనివారం ఆమె నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరూ 1.5 కిలోల బరువు ఉన్నారని అగర్వాల్‌ చెప్పారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని