covid: డెల్టా వేరియంట్‌ ఒక్కటే ఆందోళనకరం
close
Published : 03/06/2021 08:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

covid: డెల్టా వేరియంట్‌ ఒక్కటే ఆందోళనకరం

ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఐరాస: భారత్‌లో మొదటిసారి వెలుగుచూసిన బి.1.617 విభాగంలోని మూడు వేరియంట్లలో ప్రస్తుతం బి.1.617.2 రకం మాత్రమే ఆందోళనకరం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌-వీవోసీ)గా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇదే విభాగానికి చెందిన మిగతా రెండు వేరియంట్ల వ్యాప్తి మితంగానే ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ కొవిడ్‌-19 వారాంత నివేదికను మంగళవారం విడుదల చేసింది. ‘‘బి.1.617.2 (డెల్టా) రకం వైరస్‌ వివిధ దేశాల్లో ఎలా సంక్రమిస్తోంది? మరిన్ని దేశాలకు ఎలా వ్యాపిస్తోంది? అన్నది పరిశీలిస్తున్నాం. జూన్‌ 1 నాటికి ఈ వైరస్‌ ఉనికి మొత్తం 62 దేశాల్లో ఉంది. బి.1.617.1 స్ట్రెయిన్‌ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (వీవోఐ)గా వర్గీకరించాం. కొన్ని ప్రాంతాల్లో ఈ ‘కప్పా’ రకం వ్యాప్తి వేగంగానే ఉంది. ఇక బి.1.617.3 రకం వ్యాప్తి మాత్రం చాలా తక్కువ. అందుకే దీన్ని వీవోసీ లేదా వీవోఐగా వర్గీకరించలేదు.
ఆసియా-పసిఫిక్‌లో తీవ్ర పరిస్థితులు..
ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో బి.1.617.2 వేరియంట్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని ఐరాస శరణార్థుల విభాగం హై కమిషనర్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) ప్రతినిధి ఆండ్రెజ్‌ మహెకిక్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 3.8 కోట్ల కేసులు, 5 లక్షల మరణాలు చోటుచేసుకున్నాయని... ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, ఐసీయూ వసతుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. ఐరాస టీకా కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ముమ్మరం చేయాలని మహెకిక్‌ సూచించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని