దర్యాప్తునకు సహకరించనందునే రాజ్‌ కుంద్రా అరెస్ట్‌
close
Updated : 30/07/2021 06:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్యాప్తునకు సహకరించనందునే రాజ్‌ కుంద్రా అరెస్ట్‌

 బాంబే హైకోర్టుకు తెలిపిన పోలీసులు

ముంబయి: అశ్లీల చిత్రాలు తీసి, వాటిని కొన్ని యాప్‌ల ద్వారా ప్రసారం చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తునకు వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా సహకరించడం లేదని, అందువల్లే ఆయన్ను అరెస్టు చేశామని ముంబయి పోలీసులు గురువారం బాంబే హైకోర్టుకు తెలిపారు. తన అరెస్టును సవాలుచేస్తూ కుంద్రా దాఖలుచేసిన పిటిషన్‌పై ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేశారు. ఆశ్లీల చిత్రాల రూపకల్పన, ప్రసారానికి సంబంధించి ఐటీ చట్టంలో 67(ఎ)ను ఈ కేసులో ప్రయోగించడాన్ని సమర్థించుకున్నారు. ఈ నెల 19న అరెస్టైన రాజ్‌కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను దిగువ న్యాయస్థానం బుధవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా దాఖలుచేసిన దరఖాస్తును అదనపు సెషన్స్‌ జడ్జి సోనాలీ అగర్వాల్‌ గురువారం తిరస్కరించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని