భారత్‌లోని కమ్యూనిస్టులకు చైనాపైనే ప్రేమ
close
Updated : 30/07/2021 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లోని కమ్యూనిస్టులకు చైనాపైనే ప్రేమ

 వారికి దేశ ప్రయోజనాలు పట్టవు

భాజపా ఆరోపణలు

తిప్పికొట్టిన వామపక్షాలు

దిల్లీ: చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో పాల్గొన్న వామపక్ష నాయకులపై భాజపా విరుచుకుపడింది. దేశ ప్రయోజనాల కంటే భారత్‌లోని కమ్యూనిస్టులకు చైనా అంటేనే అమిత ప్రేమ అని ఆరోపించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. చైనాతో సరిహద్దు ఘర్షణ జరుగుతున్న సమయంలో వామపక్షాలు ఈ సెమినార్‌కు హాజరుకావడంపై భాజపా పశ్చిమబెంగాల్‌ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ మండిపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమాలను తాను చాలా కాలం నుంచి గమనిస్తున్నానని, వారు ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగానే పనిచేశారని పేర్కొన్నారు. చైనా ఛైర్మన్‌ను తమ ఛైర్మన్‌గా భారత్‌లోని కమ్యూనిస్టులు భావిస్తారని అన్నారు. ఈ ఆరోపణలను డి.రాజా ఖండించారు. దేశభక్తి విషయంలో భాజపా తమకు పాఠాలు చెప్పక్కర్లేదని అన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని, మరి భాజపా, ఆరెస్సెస్‌, జనసంఘ్‌ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. చైనాతో కేంద్ర ప్రభుత్వమే సన్నిహితంగా ఉందని, ఇటీవల షాంగై సహకార సంస్థ, బ్రిక్స్‌ కార్యక్రమాల్లో రెండు దేశాలు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. చైనాతో ఆర్థిక సంబంధాలను కూడా కేంద్రం కొనసాగిస్తుందని తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని