సచార్‌ నివేదికను అమలు చేయకూడదు
close
Published : 30/07/2021 06:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచార్‌ నివేదికను అమలు చేయకూడదు

 సుప్రీంకోర్టులో వ్యాజ్యం

దిల్లీ: ముస్లింల అభివృద్ధి కోసం ఉద్దేశించిన సచార్‌ కమిటీ నివేదికను అమలు చేయకూడదంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలయింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వ్యక్తులు దీన్ని దాఖలు చేశారు. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసి సూచనలు చేయడానికి 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ సిఫార్సులు చేస్తూ ఆ కమిటీ 2006 నవంబరులో నివేదిక ఇచ్చింది. మంత్రివర్గం ఆమోదం తీసుకోకుండానే ప్రధాని ఈ కమిటీని ఏర్పాటు చేసినందున ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాజ్యంలో ఆరోపించారు. కేవలం ఒక వర్గానికే ప్రయోజనాలు చేకూర్చేలా పథకాలు అమలు చేయడం సమానత్వ హక్కుకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల దీన్ని అమలు చేయకూడదంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని