పాక్‌ నుంచి చొరబాటు యత్నం
close
Updated : 24/09/2021 05:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ నుంచి చొరబాటు యత్నం

నలుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ చొరబాట్లు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. గురువారం ముగ్గురు ఉగ్రవాదులు.. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టారులో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీన్ని సైన్యం భగ్నం చేసింది. ఆ ముగ్గురినీ హతమార్చింది. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇందులో 5 తుపాకులు, 7 పిస్తోళ్లు, గ్రనేడ్లు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా సరిహద్దుల వెంబడి పాక్‌ నుంచి చొరబాట్లు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు పాక్‌ భూభాగంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పుంజుకున్నాయని సైన్యం పేర్కొంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో చొరబాట్లు పెరగొచ్చన్న సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు తమ అప్రమత్తతను పెంచాయి. మరో ఘటనలో శోపియా జిల్లాలోని కేష్వా ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక ఉగ్రవాదిని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. మాదకద్రవ్యాల వ్యాపారంలోనూ అతనికి ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని