పట్నాకు 8 మంది కొత్త న్యాయమూర్తులు
close
Published : 24/09/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్నాకు 8 మంది కొత్త న్యాయమూర్తులు

సుప్రీం కొలీజియం సిఫార్సు

ఈనాడు, దిల్లీ: పట్నా హైకోర్టుకు కొత్తగా 8 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌ నేతృత్వంలోని కొలీజియం గురువారం సమావేశమై 8 మంది పేర్లను సిఫార్సు చేసింది. వారిలో ఆరుగురు న్యాయవాదులు, ఇద్దరు జ్యుడిషియల్‌ ఆఫీసర్లు ఉన్నారు. ఆ హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 53 కాగా, ప్రస్తుతం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీకి కొలీజియం ఈ పేర్లను సిఫార్సు చేసింది. దీంతో ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల నియామకం, బదిలీలు అన్నీ కలిపి 151 పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్లయింది.

శాశ్వత న్యాయమూర్తులుగా 12 మందికి పదోన్నతి

హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తున్న 12 మందికి శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. కర్ణాటక హైకోర్టుకు చెందిన 10 మంది, కేరళ హైకోర్టుకు చెందిన ఇద్దరు ఆయా కోర్టుల్లోనే శాశ్వత న్యాయమూర్తులుగా కొనసాగనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని