పోలీసుల సత్వర స్పందనతో తప్పిన పెను ముప్పు
close
Published : 26/09/2021 05:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల సత్వర స్పందనతో తప్పిన పెను ముప్పు

కోర్టులో కాల్పుల వ్యవహారం

దిల్లీ: దేశ రాజధానిలోని రోహిణి కోర్టు రూంలో గ్యాంగ్‌స్టర్ల కాల్పుల సమయంలో పోలీసులు సత్వరమే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారని పోలీసు వర్గాలు తెలిపాయి. శుక్రవారం కోర్టుకు వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగీపై న్యాయవాదుల వేషంలో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులు జరిపిన విషయం విదితమే. అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌.ఐ. వీర్‌ సింగ్‌, మరో ఇద్దరు కమాండోలు శక్తి, చిరాగ్‌లు కూడా వారిని అదుపు చేయడానికి కాల్పులు జరిపారు. గోగీని జైలు నుంచి వారే కోర్టుకు తీసుకువచ్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో న్యాయవాదుల వేషంలో ఉన్న దుండగులు హతమయ్యారు. ఇది జరగకపోయి ఉంటే వారు మిగిలిన వారిపైనా కాల్పులు జరిపి ఉండేవారని పోలీసువర్గాలు భావిస్తున్నాయి.

భారీగా పోలీసుల బదిలీలు

శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ భారీగా పోలీసు అధికారులను బదిలీ చేశారు. 11 మంది స్పెషల్‌ కమిషనర్లు, 28 మంది డీసీపీలు, అదనపు డీసీపీలు సహా 40 మంది ఉన్నతాధికారులకు స్థాన చలనం కలిగించారు. రోహిణి జిల్లా అదనపు డీసీపీ-2 సుశీల్‌ కుమార్‌ సింగ్‌ను విజిలెన్స్‌ డీసీపీగా బదిలీ చేశారు. దిల్లీ పోలీసు కమిషనర్‌గా రాకేశ్‌ ఆస్థానా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి బదిలీలు ఇదే కావడం గమనార్హం.

దిల్లీ కోర్టుల వద్ద భద్రత పెంపు

కాల్పుల నేపథ్యంలో శనివారం జిల్లా న్యాయస్థానాల వద్ద పోలీసులు భద్రత పెంచారు. న్యాయవాదులు, కక్షిదారులను పూర్తిగా తనిఖీ చేయడంతో పాటు, స్టిక్కర్లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కోర్టుల బయటా, లోపల కూడా పోలీసులను మోహరించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని