పుట్టింటికి పురాతన వస్తువులు
close
Published : 26/09/2021 05:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుట్టింటికి పురాతన వస్తువులు

157 కళాఖండాలను భారత్‌కు అందజేసిన అమెరికా

దిల్లీ: అక్రమ రవాణా సహా వివిధ మార్గాల్లో భారత్‌ నుంచి తరలిపోయి అమెరికా చేరిన కళాఖండాలు తిరిగి సొంత దేశం చేరుకోనున్నాయి. ఈ మేరకు 157 పురాతన వస్తువులు, కళాఖండాలను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఆ దేశం అందజేసింది. వీటిలో 71 సాంస్కృతిక పరమైనవి కాగా, 60 హిందూ మతానికి చెందినవి, 16 బౌద్ధమతానికి చెందినవి, 10 జైన మతానికి చెందినవి ఉన్నట్లు శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా అమెరికా యంత్రాంగానికి, అధ్యక్షుడు బైడెన్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. సాంస్కృతిక పరమైన వస్తువుల చోరీ, అక్రమ రవాణా, వ్యాపారం వంటివి నిర్మూలించేలా చర్యలను బలోపేతం చేసేందుకు ఇద్దరు నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత్‌ నుంచి తరలిపోయిన వివిధ వస్తువుల్లో 1976 నుంచి 2013 వరకు కేవలం 13 వస్తువులు మాత్రమే తిరిగి స్వదేశానికి చేరాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2004 నుంచి 2014 మధ్య కేవలం ఒక్కటంటే ఒక్క వస్తువు మాత్రమే భారత్‌కు చేరినట్లు వెల్లడించాయి. 2014లో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించాక అప్పటి నుంచి 2021 వరకు 200కుపైగా పురాతన వస్తువులను స్వదేశానికి రప్పించినట్లు తెలిపాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని