విధులకు దూరంగా ఉండాలంటూ ఆ జడ్జికి పట్నా హైకోర్టు ఆదేశం
close
Published : 26/09/2021 05:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విధులకు దూరంగా ఉండాలంటూ ఆ జడ్జికి పట్నా హైకోర్టు ఆదేశం

పట్నా: గ్రామంలోని మహిళలందరి దుస్తులను ఉచితంగా 6 నెలల పాటు ఉతికి, ఇస్త్రీ చేయాలంటూ.. ఓ నిందితుడికి ఆదేశాలిచ్చిన బిహార్‌లోని అదనపు సెషన్స్‌ జడ్జి అవినాశ్‌ కుమార్‌ను జ్యుడీషియల్‌ విధులకు దూరంగా ఉండాలని పట్నా హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులిచ్చేంతవరకు విధులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఓ అత్యాచార యత్నం కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసే సమయంలో అతను 6 నెలల పాటు మహిళల దుస్తులను శుభ్రం చేయాలంటూ.. ఝాంఝర్‌పుర్‌ అదనపు సెషన్స్‌ జడ్జి అవినాశ్‌ కుమర్‌ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

గతంలోనూ ఇలాంటి ఆదేశాలు..

అవినాశ్‌ కుమార్‌ గతంలోనూ కొన్ని కేసుల్లో ఇలాంటి ఆదేశాలిచ్చారు. ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో ఇద్దరికి బెయిల్‌ మంజూరుకు గాను ఆసక్తికరమైన షరతు విధించారు. వారిద్దరూ పేద కుటుంబాలకు ఉచితంగా పప్పులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మరో కేసులో లైసెన్స్‌లేని ఆయుధాలను కలిగిన అభియోగాలు ఎదుర్కొంటున్న తాపీ పని చేసే ఓ వ్యక్తిని గుడి వద్ద ఉచితంగా సేవలందించాలని ఆదేశాలిచ్చారు. పోషకాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలకు ఉచితంగా అర లీటరు పాలు పంపిణీ చేయాలంటూ.. ఓ కొట్లాట కేసులో పాల వ్యాపారం చేసుకునే ఇద్దరిని ఆదేశించారు. అలాగే ఓ కాలనీలో స్థానికులతో కొట్లాటకు దిగిన మరో వ్యక్తికి ఆ ప్రాంతంలో మురికి కాలువలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని