మెర్కెల్‌ వారసునిపై ఉత్కంఠ
close
Published : 26/09/2021 05:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెర్కెల్‌ వారసునిపై ఉత్కంఠ

నేడే జర్మనీ ఎన్నికలు

బెర్లిన్‌: పదహారేళ్లుగా ఆంగెలా మెర్కెల్‌ అవిచ్ఛిన్న పాలనలో ఉన్న జర్మనీ ఆదివారం పార్లమెంటుకు జరగనున్న ఎన్నికల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనుంది. ఈ ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ (సీడీయూ), క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ (సీఎస్‌యూ) కూటమి కన్నా సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎస్‌డీపీ) కాస్త ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. మెర్కెల్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఉన్న ఎస్‌డీపీ అభ్యర్థి ఓలాఫ్‌ షోల్జ్‌ ఈసారి ఛాన్స్‌లర్‌ పదవికి పోటీపడుతున్నారు. సీడీయూ అధ్యక్షుడైన ఆర్మిన్‌ లాషెట్‌, గ్రీన్స్‌ పార్టీ అభ్యర్థి ఎనలీనా బేయర్‌ బాక్‌ కూడా బరిలో ఉన్నా,  అవకాశాలు ఒలాఫ్‌కే ఉన్నాయని అత్యధికులు భావిస్తున్నారు. జులైలో వరద ముంపునకు గురైనప్పుడు దేశాధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌ మెయర్‌ గంభీరంగా ప్రసంగిస్తుంటే, వేదికపై ఆయన వెనుక ఉన్న లాషెట్‌ నవ్వు ముఖంతో కనిపించడం ఓటర్లకు వెగటు పుట్టించింది. గ్రీన్స్‌ పార్టీ అభ్యర్థి ఎనలీనా తన దరఖాస్తులో తప్పులు రాశారనీ, గ్రంథ చౌర్యానికి పాల్పడ్డారనీ ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో లాషెట్‌ వాతావరణ మార్పులను సాంకేతిక పరిజ్ఞానంతో, మార్కెట్‌ కేంద్రిత విధానాలతో అధిగమించాలని వాదిస్తే, ఓలాఫ్‌ షోల్జ్‌ ఉపాధి నష్టం జరగని రీతిలో హరిత ఆర్థిక వ్యవస్థకు మారాలంటున్నారు. గ్రీన్స్‌ పార్టీ అసలు శిలాజ ఇంధనాలకు పూర్తిగా స్వస్తి చెప్పి,  సౌర ఇంధనానికి మారిపోవాలంటోంది. కరోనా ముగిసిన తరవాత ఆర్థిక పునరుచ్కీజీజ్జివనం కోసం అసలు పన్నులు పెంచకూడదని లాషెట్‌ వాదిస్తే, సంపన్న జర్మన్లపై పన్నులు పెంచాలని ఓలాఫ్‌, బేయర్‌ బాక్‌లు ప్రతిపాదిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని