Online Games: పిల్లల కోసం ‘డిజిటల్‌ డీ-ఎడిక్షన్‌ కేంద్రాలు’
close
Published : 26/09/2021 07:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Online Games: పిల్లల కోసం ‘డిజిటల్‌ డీ-ఎడిక్షన్‌ కేంద్రాలు’

కేరళలో ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రకటన

తిరువనంతపురం: చాలామేర పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బానిసలవుతుండటం చూస్తున్నాం. ఈ ‘అలవాటు’ నుంచి వారిని బయట పడేసేందుకు కేరళ ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు రాష్ట్రంలో చిన్నారుల కోసం ‘డిజిటల్‌ డీ-ఎడిక్షన్‌ కేంద్రాల’ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం ప్రకటించారు. రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి నూతన/ పునరుద్ధరించిన భవనాలను ఆన్‌లైన్‌లో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పోలీసుల కోరిక మేరకు ఏర్పాటు చేసే ఈ కేంద్రాలు ఆన్‌లైన్‌  గేమ్స్‌లో మునిగితేలుతున్న పిల్లలను సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకొస్తాయి’’ అని విజయన్‌ అన్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలవుతూ చిన్నారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉదంతాలు తరచూ బయటపడుతున్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు అనుకూలంగా (చిల్డ్రన్‌-ఫ్రెండ్లీగా) ఉండే మరో 20 పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో కేరళలో ఇలాంటి ఠాణాల సంఖ్య 126కి చేరుతుంది. పోలీసులు ప్రజాసేవలో ఆదర్శంగా పనిచేస్తున్నారని విజయన్‌ కితాబునిచ్చారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని