ఎస్పీ బాలు సమాధి వద్ద ఘన నివాళి
close
Updated : 26/09/2021 06:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్పీ బాలు సమాధి వద్ద ఘన నివాళి

పెరియపాళ్యం, న్యూస్‌టుడే: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన స్మారకమందిరం వద్ద కుటుంబీకులు, అభిమానులు ఘననివాళులు అర్పించారు. తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పెరియపాళ్యం సమీపం తామరైపాక్కంలోని ఫాంహౌస్‌లో ఎస్పీబీ స్మారక మందిరం ఉంది. ఎస్పీబీ కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, కొందరు అభిమానులను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. ప్రవేశానికి నిరాకరించడంతో కొందరు నిరాశ చెందగా.. ఎస్పీబీ కుమారుడు చరణ్‌ వారికి నచ్చజెప్పారు.  హైదరాబాద్‌ గచ్చిబౌలికి చెందిన శాంతిరాజు అనే వీరాభిమాని ఎస్పీబీ పాడిన తనకు ఇష్టమైన పాటలను కాగితాలపై రాసి మాలగా ధరించారు. ప్రధాన రహదారినుంచి అర కిలోమీటరు వరకు మోకాళ్లపై నడుస్తూ వచ్చి  స్మారక మందిరం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

ఎస్పీబీకి ముఖ్యమంత్రి నివాళి

ఈనాడు, అమరావతి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తన గాత్రంతో తెలుగువారినే కాదు, ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

నమ్మాలనిపించడం లేదు: చంద్రబాబు

‘‘మైమరపించే ఎస్పీ బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడం లేదు’’ అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని