వచ్చే ఏడాది అక్టోబరు నాటికి నూతన పార్లమెంటు భవనం
close
Published : 26/09/2021 05:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే ఏడాది అక్టోబరు నాటికి నూతన పార్లమెంటు భవనం

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: నూతన పార్లమెంట్‌ భవనం 2022 అక్టోబరు నాటికి పూర్తి కానుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. శనివారం బెంగళూరులోని విధానసౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలోని కీలక ఘట్టాలు, స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తొలి స్పీకర్ల సమ్మేళనం, ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటై వందేళ్లు ముగిసిన సందర్భంగా శిమ్లాలో సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఇదే సందర్భంగా స్పీకర్‌ అధికారాల సవరణ చట్టంపై నివేదిక రూపొందించి సర్కారుకు అందజేస్తామని తెలిపారు. లోక్‌సభలో చర్చించే కీలకమైన బిల్లులు, విధానాలపై చేపట్టే నిర్మాణాత్మక చర్చలను డేటాబేస్‌ రూపంలో పార్లమెంట్‌ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని ఓం బిర్లా ప్రకటించారు. మరో ఆరు నెలల్లో ఈ ప్రక్రియ ముగియనుందని చెప్పారు. కొత్త తరానికి స్ఫూర్తి నింపే దిశగా ఆంగ్లం, హిందీ భాషల్లో ఈ డేటాబేస్‌ను తయారు చేస్తామని వివరించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని