నాట్స్, టీసీఎల్‌ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్‌
close
Published : 04/01/2020 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాట్స్, టీసీఎల్‌ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్‌

టెంపా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) అమెరికాలోని టెంపాలో డిసెంబర్‌ 31న (2019) క్రికెట్ పోటీలను నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో 12 జట్లు పాల్గొన్నాయి. టెంపాలో స్థానిక క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి నాట్స్ ఈ పోటీలు నిర్వహించింది. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ లీగ్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. టీసీఎల్ ఛైర్మన్ నితీశ్ శెట్టితో సమన్వయం చేసుకుంటూ నాట్స్ ఈ పోటీలను నిర్వహించింది. దాదాపు 250 మందికిపైగా ఔత్సాహికులు ఈ పోటీలను వీక్షించేందుకు వచ్చారు. ఈ లీగ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటుగా పోటీల్లో రాణించిన ఆటగాళ్లకు నాట్స్, టీసీఎల్ సంయుక్తంగా ప్రత్యేక బహుమతులు అందజేసింది. నాట్స్ బోర్డ్ నుంచి శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని ఆటగాళ్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరి, అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ టెంపా సభ్యులు ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ బైరెడ్డి, శ్రీధర్‌ గౌరవెల్లి, భరత్ ముద్దన, శ్రీనివాస్ కశెట్టి తదితరులకు నాట్స్‌, టీసీఎల్ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని