పాస్‌పోర్టు ర్యాంకులు.. భారత్‌ స్థానమెంత?
close
Updated : 13/01/2020 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాస్‌పోర్టు ర్యాంకులు.. భారత్‌ స్థానమెంత?

దిల్లీ: ప్రపంచ పాస్‌పోర్టు ర్యాంకుల్లో భారత్‌ 84వ స్థానంలో నిలిచింది. ‘ప్రపంచ అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులు’ పేరిట హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ 2020 సంవత్సరానికి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్‌ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది. గతేడాది పోలిస్తే భారత్‌ 2 స్థానాలు దిగజారడం గమనార్హం.

ఇక ఈ జాబితాలో జపాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. అమెరికా, యూకే ఈ జాబితాలో ఎనిమిదో ర్యాంకులో నిలిచాయి. అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టు చిట్టచివరి స్థానంలోనూ.. పాకిస్థాన్‌ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో సింగపూర్‌ (190 దేశాల్లో పర్యటించే వీలు).. జర్మనీ, దక్షిణ కొరియా (189), ఫిన్లాండ్‌, ఇటలీ (188), డెన్మార్క్‌, లగ్జెంబర్గ్‌, స్పెయిన్‌ (187) టాప్‌-5లో నిలిచాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని