విదేశాల్లో వివాదాలకూ ‘వివాద్‌సే విశ్వాస్‌’
close
Published : 22/02/2020 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశాల్లో వివాదాలకూ ‘వివాద్‌సే విశ్వాస్‌’

దిల్లీ: పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకరణదారులకు మధ్య వివాదాల పరిష్కారానికి ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం పరిధిలోకి విదేశాల్లో వివాదం కేసులు కూడా వస్తాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి ఈ పథకం సువర్ణావకాశం వంటిదని వెల్లడించింది. జనవరి 31 లేదా అంతకన్నా ముందు దాఖలైన పిటిషన్లు, రిట్‌లు ఈ పథకానికి అర్హమైనవని ఐటీ శాఖ తెలిపింది. ఇప్పటికే చెల్లించిన పన్నులకు సంబంధించిన వివాదాలు కూడా దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేసింది. పన్నులు, పెనాల్టీలు, వడ్డీ ఫీజులు, టీడీఎస్‌, టీసీఎస్‌ వివాదాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని