ఆరు నెలల నిబంధన భారతీయులకు వర్తించదు!
close
Updated : 11/03/2020 08:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరు నెలల నిబంధన భారతీయులకు వర్తించదు!

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరుతో పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది. వాటికి హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలను అందించారు.
2010 నుంచి బి1 వీసా ఉంది. ఇప్పటి వరకు అమెరికా వెళ్లలేదు. వచ్చే నెలలో వీసా కాలం తీరబోతోంది. రెండు వారాల కోసం ఇప్పుడు అమెరికా వెళ్లవచ్చా? ఏమైనా ఇబ్బందులు వస్తాయా?

- నూర్‌

 

జ: వీసా చెల్లుబాటు కాలంలోపు ఎప్పుడైనా అమెరికా వెళ్లవచ్చు. అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు మాత్రమే వీసా అనుమతిస్తుంది. అమెరికా లోపలకి అనుమతించాలా? లేదా? అనుమతిస్తే ఎప్పటి వరకు అన్నది ప్రవేశ ప్రాంతంలోని ఇమిగ్రేషన్‌ అధికారి నిర్ణయిస్తారు. మరింత సమాచారం కోసం www.ustraveldocs.com ను చూడండి.
2019లో ఆమోదం పొందిన హెచ్‌1బి వీసా ఉంది. ఈ నెలలో నాకు వివాహం జరగబోతోంది. నాకు కాబోయే భర్తకు హెచ్‌4 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? వీసా మంజూరు కావటానికి ఎంత సమయం పడుతుంది?

- దివ్వ శ్రీవాణి¨

 

జ: డిపెండెంట్‌ వీసా సమాచారం కోసం, అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేసుకోడానికి ‌www.ustraveldocs.com చూడండి. వీసా ప్రక్రియ ఒక్కో దరఖాస్తుదారుడికి ఒక్కో రకంగా ఉంటుంది. వీసాతో కూడిన పాస్‌పోర్టు చేతిలోకి వచ్చేంత వరకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవద్దు  అన్నది మా సూచన.
* వీసాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి.
* మరింత సమాచారానికి హైదరాబాద్‌ లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ https://in.usembassy.gov/embassy -consulates/hyderabad/చూడవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపవచ్చు.
పాస్‌పోర్టులోని నా పేరులో అక్షర దోషం ఉంది. బి1/బి2 వీసా కోసం దరఖాస్తు చేద్దామనుకుంటున్నాను. ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా?

- సింగమనేని కృష్ణకిషోర్‌

 

జ: పాస్‌పోర్టులో అక్షర దోషాలు ఉంటే ముందుగా దాన్ని సరిదిద్దుకోడానికి దరఖాస్తు చేసుకుని కొత్త పాస్‌పోర్టును పొందండి. అక్షర దోషాలను సరిదిద్దు కోకుండా వీసా పొందినా ప్రవేశ ప్రాంతంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.  ప్రవేశాన్ని నిరాకరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే అక్షర దోషాలను చక్కదిద్దిన తర్వాత వచ్చిన పాస్‌పోర్టుతోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోండి. వీసా కోసం దరఖాస్తు చేసుకోడానికి www.ustraveldocs.com ను పరిశీలించండి.
వచ్చే నెలలో నా పాస్‌పోర్టు కాలం తీరబోతోంది. అత్యవసర పని మీద వారం రోజుల కోసం అమెరికా వెళ్లవచ్చా? అమెరికా ప్రవేశ ప్రాంతం వద్ద ఏమైనా సమస్యలు ఎదురవుతాయా?

- రామకృష్ణ కొవ్వూరు

 

జ: పర్యాటక వీసాపై  అమెరికా వచ్చే వారికి విధిగా పాస్‌పోర్టు, వీసా చెల్లుబాటు కాలం కనీసం ఆరు నెలలు లేదా అంతకు మించి ఉండాలి. ఆ నిబంధన నుంచి భారతీయ ప్రయాణికులకు అమెరికా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అమెరికా వచ్చే క్రమంలో మరో దేశంలో ఆగి (ట్రాన్సిట్‌) వచ్చే పక్షంలో ఆరు నెలల నిబంధన వర్తిస్తుంది. మరింత సమాచారం కోసం www.travel.state.gov ను చూడండి.

          - ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని